బెంగాల్‌లో బీజేపీకి షాక్‌ – ఉప ఎన్నికల్లో టీఎంసీ క్లీన్‌స్వీప్‌

0
156

మనఛానల్‌ న్యూస్‌ – నేషనల్‌ డెస్క్‌
పశ్చిమ బెంగాల్‌లో మూడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఊహించని షాక్‌ తగిలింది.అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ క్లీన్‌స్వీప్‌ చేసింది.ఉప ఎన్నికలు జరిగిన మూడు శాసనసభా స్థానాలను తృణమూల్‌ కైవసం చేసుకుంది. రెండు దశాబ్దాల అనంతరం కలియాగంజ్‌ స్థానాన్ని తృణమూల్‌ కాంగ్రెస్‌ దక్కించుకుంది.ఈ ఫలితాలపై తృణమూల్‌ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హర్షం వ్యక్తం చేశారు.

ఉప ఎన్నికల ఫలితాలు ప్రజా విజయంగా పేర్కొన్న ఆమె బీజేపీకి ఇక రోజులు దగ్గర పడ్డాయని వ్యాఖ్యానించారు. అహంకారపూరిత రాజకీయాలు పనిచేయవని,అందుకే బీజేపీని ప్రజలు తిరస్క రించారని మమతా విమర్శించారు.ఖరగ్‌ పూర్‌ సదర్‌ నుంచి పోటీ చేసిన తృణమూల్‌ అభ్యర్థి ప్రదీప్‌ సర్కార్‌ 20,811 ఓట్ల తేడాతో గెలుపొందారు.అలాగే కరీంపూర్‌,కలియాగంజ్ నుంచి తృణమూల్‌ అభ్యర్థులు విజయం సాధించారు.మరోవైపు ఉప ఎన్నికల్లో విజయంతో తృణమూల్‌ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.