ప్రముఖ టాలీవుడ్‌ నిర్మాత సురేశ్‌బాబు నివాసంలో ఐటీ సోదాలు

0
72

మనఛానల్‌ న్యూస్‌ – హైదరాబాద్‌
ప్రముఖ తెలుగు సినీ నిర్మాత దగ్గుబాటి సురేశ్‌బాబు నివాసంలో ఆదాయపన్ను శాఖ అధికారులు బుధవారం దాడులు చేశారు.ఆయన కార్యాలయల్లోనూ ఐటీ అధికారులు సోదాలు కొనసాగిస్తు న్నారు.రామానాయుడు స్టూడియోతో పాటు,సురేశ్‌ ప్రొడక్షన్ కార్యాలయాల్లో తనిఖీలు జరుపు తున్నారు.సోదాల్లో పలు కీలక పత్రాలు లభ్యమయినట్టు తెలుస్తోంది.పన్నుల ఎగవేతకు సంబంధించి అధికారులు ఆరా తీస్తున్నారు.సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి.ఇటీవల కాలంలో చిన్న సినిమాలను పెద్ద ఎత్తున సురేశ్‌బాబు పంపిణీ చేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో పలు ధియేటర్లను కూడా సొంతంగా ఆయన నడిపిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం మైత్రి మూవీ మేకర్స్‌,దిల్‌ రాజు,కెఎల్‌ నారాయణ నివాసాలు, కార్యాలయాల్లోనూ ఐటీ సోదాలు జరిగిన సంగతి తెలిసిందే.వరుస ఐటీ దాడులతో టాలీవుడ్‌ నిర్మాతలు కంగారుపడుతున్నారు.కాగా,గత నెలలో ప్రముఖ సినీ నిర్మాణ,డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ ఏషియన్‌ సినిమాస్‌ కార్యాలయాలపై ఐటీ దాడులు జరిగాయి. సంస్థ అధినేతలు నారయణదాస్‌,సునీల్‌ నారంగ్‌ల ఇళ్లతో పాటు వారి సన్నిహితుల నివాసాలతో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.