కమ్మరాజ్యంలో కడప రెడ్లు నవంబర్ 29న విడుదల

0
75

మనఛానల్ న్యూస్ – హైదరబాద్
సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజా చిత్రం కమ్మరాజ్యంలో కడప రెడ్లు నవంబర్ 29వ తేదీన విడుదల కానుంది. ఈ మేరకు చిత్రం దర్శక, నిర్మాతలు విడుదలకు సిద్దమయ్యారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన రెండు ట్రైలర్స్ ను విడుదల చేశారు. ట్రైలర్స్ కు మంచి స్పందన లభించింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఈ చిత్రం గుదిబండగా మారతుందనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఏపి టిడిపిలో సంక్షోభం నెలకొంటున్న తరుణంలో ఈ చిత్రం రావడం వల్ల కొంత సమస్యేనని తెలుగుదేశం వర్గాలు అంటున్నాయి. ఈ చిత్రంలో వై.ఎస్.జగన్, చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, కె.ఎ.పాల్ వంటి పాత్రలను చక్కగా చూపించినట్లు కనిపిస్తోంది. అసెంబ్లీ సమావేశాల తీరును కూడ ఇందులో చూపారు.ప్రముఖ కమేడియన్లు బ్రహ్మానందం, అలీతోపాటు, కత్తిమహేష్, టివి న్యూస్ యాంకర్స్ స్వప్న, జాఫర్ లు నటించారు.