ఆ బొడ్డోడు మన పార్టీని లాగేసుకొంటే ? – కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సంచలన ట్రైలర్ ను విడుదల చేసిన వర్మ

0
208

మనఛానల్ న్యూస్ – సినిమా ప్రతినిధి
సంచలన సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏపి రాజకీయాలపై తీస్తున్న కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమా సంబంధించి విడుదల చేసిన తాజా ట్రైలర్ లో కొన్ని డైలాగులు, సన్నివేశాలు సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. చంద్రబాబు, లోకేష్ ల సంభాషణల మధ్య ఓ ఎం.ఎల్.ఏ పాత్రదారి చెప్పిన డైలాగ్ సంచలనం రేపుతోంది. చంద్రబాబుకు వచ్చే ఎన్నికల నాటికి 75 ఏళ్లు దాటేస్తున్న తరుణంలో రాజకీయాలు చేయడం కష్టమంటూ చెప్పుతూ..ఆలోపు బొడ్డోడు(జూనియర్ ఎన్.టి.ఆర్)పార్టీని లాగేసుకొంటాడేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్న సన్నివేశం ఆసక్తికరంగా మారింది. దీనిని వీక్షించే ప్రేక్షకులు భవిష్యత్ లో టిడిపి పగ్గాలు జూనియర్ ఎన్.టి.ఆర్ తీసుకోబోతున్నారేమోననే అనుమానం వచ్చేలా ఉంది. అలాగే ట్రైలర్ లో ఏపి అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరును చక్కగా చూపారు. ఏపి సి.ఎం. వై.ఎస్.జగన్ తొలి రోజు సమావేశంలో చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడిన డైలాగులు అచ్చం అసెంబ్లీ నమావేశాలు మాదిరిగా కనిపిస్తున్నాయి. స్పీకర్ గా అలీలో తమ్మినేని సీతారామ్ మాదరిగా సీట్లో కూర్చోవడం, చంద్రబాబు -లోకేష్ పాత్రదారుల హవబావాలు అదుర్స్ ..తప్పక సినిమా చూడాలనే ఆసక్తిని రేపుతున్నాయనడంలో సందేహం లేదు.

https://www.facebook.com/amar.natahreddy/videos/2662802087111834/?t=1

https://www.facebook.com/amar.natahreddy/videos/2662802087111834/?t=66

https://www.facebook.com/amar.natahreddy/videos/2662802087111834/?t=2