మనఛానల్ న్యూస్ – ఎన్ఆర్ఐ డెస్క్
అమెరికాకు అక్రమంగా వలస వెళ్లిన దాదాపు 145మంది భారతీయుల్ని అమెరికా వెనక్కి పంపింది. వారంతా బుధవారం దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోనున్నారు.వీరితో పాటు మరికొంత మంది బంగ్లాదేశీయులు, శ్రీలంక వాసులు కూడా ఉన్నారు.గత కొన్నేళ్లుగా వీరంతా అక్రమ మార్గంలో అమెరికాకు చేరుకున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు.
మరికొంత మంది వీసా గడువు ముగిసినప్పటికీ అక్రమంగా అక్కడే నివసిస్తున్నట్లు తేల్చారు. గతం లోనూ అమెరికా ఇలాగే 117మంది భారతీయుల్ని వెనక్కి పంపింది.అలాగే ఒక మహిళ సహా 311 మందిని మెక్సికో వెనక్కి పంపిన విషయం తెలిసిందే.డాలర్ల ఆర్జన కలలతో వీరంతా ఒక్కొక్కరు రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు అంతర్జాతీయ ఏజెంట్లకు చెల్లించి అక్రమంగా మెక్సికోకు చేరుకోగలి గారని ఇమ్మిగ్రేషన్ అధికారులు అప్పట్లో ధ్రువీకరించారు.