ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటా – తంబళ్లపల్లి ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి

0
397

మనఛానల్‌ న్యూస్‌ – మదనపల్లె
ప్రజకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతానని తంబళ్ల పల్లి నియోజకవర్గ శాసనసభ్యులు పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి అన్నారు.మంగళవారం తంబళ్లపల్లె మండలంలోని ఎద్దులవారిపల్లె పంచాయతీలో నిర్వహించిన ‘‘మన ఊరికి – మన ఎమ్మెల్యే’’ కార్య క్రమంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా పంచాయతీలోని ప్రజల వద్ద నుండి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం పంచాయతీలోని పరిసరాలను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి పథంలో పయని స్తున్నదన్నారు.

వైఎస్సార్‌సీపీ ప్రవేశపెట్టిన నవరత్నాలు ప్రజలకు అనతికాలంలోనే చేరువైయాని అన్నారు. కుల, మత,ప్రాంత,రాజకీయాలకతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని ఆయన ఉద్ఘాటిం చారు.ఇకపోతే తంబళ్లపల్లి నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి పరచేందుకు కృషి చేస్తున్నా నన్నారు.సీఎం వై.ఎస్‌.జగన్‌ సహకారంతో నియోజకవర్గాన్ని కనీవినీ రీతిలో అభివృద్ధి చేసి చూపిస్తా నన్నారు.ప్రజలు సమస ఏదైనా సరే తన దృష్టికి తీసుకురావాని ఆయన కోరారు.