భావితరాల భవిష్యత్ కోసమే ఇంగ్లీష్ మీడియం బడులు – సి.ఎం. వై.ఎస్. జగన్ వెల్లడి

0
57

మనఛానల్ న్యూస్ – ఒంగోలు
మారుతున్న సమాజంలో ప్రతి ఒక్కరూ ముందడుగు వేయాలని,ఈ పోటి ప్రపంచంలో భావి తరాలు వెనుకడుగు వేయకుండ మంచి భవిష్యత్ ను ఇవ్వాలనే ఉద్దేశ్యంతోనే తాము ఇంగ్లీష్ మీడియం విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించినట్లు ఎం.పి. సి.ఎం. వై.ఎస్.జగన్ తెలిపారు. 1వతరగతి నుంచి 6వతరగతి వరకు ఇంగ్లీషీ మీడియం బడులను వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభిస్తామని తెలుగు, ఉర్ధూ భాషలకు సైతం ప్రాధాన్యత ఇస్తామన్నారు. రాబోయే రోబోటిక్ యుగంలో మన పిల్లలు ప్రపంచంతో సమానంగా పోటి పడాలంటే ఇంగ్లీష్ నేర్చుకోవడం తధ్యమన్నారు. ప్రపంచంతో పోటీ పడేలా పిల్లలను తీర్చిదిద్దాల్సిన అవసరం, బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఒక మంచి నిర్ణయం సరైన సమయంలో తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. గురువారం ఒంగోలులోని పీవీఆర్‌ బాలుర పాఠశాలలో ‘నాడు-నేడు’కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ..భావి తరాల భవిష్యత్ కోసం తన ప్రభుత్వం ఎంతో కట్టుబడి ఉందని తన సందేశంలో వివరించారు.సంస్కృతి పేరుతో పిల్లల భవిష్యత్‌ను పట్టించుకోకపోతే భావితరాల ముందు సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది. రాబోయే రోజుల్లో తెలుగు ప్రజలు ప్రపంచంతో పోటీ పడేలా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం.నాడు-నేడుతో ప్రతీ పాఠశాలలో తాగునీరు, మరుగుదొడ్లు, తరగతి గదిలో ట్యూబ్‌లైట్లు, ఫర్నీచర్‌, స్కూల్‌కు కాంపౌండ్‌ వాల్‌, ల్యాబ్స్‌ వంటి సకల సౌకర్యాలను కల్పిస్తామన్నారు.ఒకే మారు ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెడితే కొన్ని సమస్యలు వస్తాయన్న విషయం ముందే తెలుసు. వాటన్నంటిని అధిగమించేందుకు బ్రిడ్జ్‌ కోర్సులు ఏర్పాటు చేస్తాం. ప్రతి టీచర్ కు శిక్షణ ఇస్తాం.తొలి మూడేళ్లు కొంత ఇబ్బంది రావచ్చు..రాబోయే రోజుల్లో అన్ని సర్దుకుపోతాయి. . ప్రతీ ఏడాది స్కూళ్ల కోసం రూ.3500 కోట్లు ఖర్చు చేస్తాం. వచ్చే కాలంలో రాష్ట్రంలోని 45 వేల స్కూళ్ల రూపురేఖలను మారుస్తాం. తొలి విడతలో భాగంగా దాదాపు 15,700 పాఠశాలల్లో నాడు-నేడు ప్రారంభిస్తాం. జూన్‌, 2020 నాటికి పాఠశాలల్లో అన్ని వసతులు తీసుకొస్తాం. జనవరి 9న అమ్మ ఒడి పథకం కింద రూ. 15 వేలు ఇస్తామని సి.ఎం. జగన్ తెలిపారు.