బుచ్చిరెడ్డిగారిపల్లి పాఠశాలలో బాలల దినోత్సవం – బాలభటులచే నెహ్రూజీకి నివాళి

0
62

మనఛానల్ న్యూస్ – బి.కొత్తకోట
నవంబరు14వ తేదిన గురువారం నాడు జాతీయ బాలల దినోత్సవాన్ని చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలం బుచ్చిరెడ్డిగారిపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో క్లస్టర్ ప్రధానోపాధ్యాయులు పురుం ఢిల్లీ ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలకు చెందిన స్కౌట్స్ అండ్ గైడ్ (బాలభటులు) విద్యార్థుల చేత భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి గౌరవ వందనం చేశారు. విద్యార్థులు నెహ్రు పటాన్ని రోజా పూలతో అలంకరించారు. ఈ సందదర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఢిల్లీ ప్రసాద్ మాట్లాడుతూ నెహ్రూ భారతీయ సమాజం కోసం ఎంతో చేశారని,ఆయన సేవలు చిరస్మరణీయని, ఆదర్శవాదిగా నిలచారన్నారు. పిల్లల పట్ల నెహ్రు కు ఎంతో ప్రేమాభిమానాలు ఉండేవని తెలిపారు. విద్యార్థులు ఆయన ఆశయాల సాధనకు ప్రయత్నించాలని అన్నారు. బాలల దినోత్సవం సందర్భంగా పాఠశాలలలో పలు సాంస్కతిక కార్యక్రమాలు, క్రీడలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందచేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విజయలక్ష్మీ, సి.ఆర్.పి.వెంకటరమణ, ఎస్.ఎం.సి.సభ్యులు పాల్గోన్నారు.