పుంగనూరు రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమిలో ఘనంగా బాలల దినోత్సవం

0
197

మనఛానల్ న్యూస్- పుంగనూరు
పుంగనూరులోని రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీలో గురువారం బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రు కు పిల్లల పట్ల ప్రేమకు చిహ్నముగా ఆయన జన్మదినోత్సవం నాడు బాలల దినోత్సవాన్ని జరుపుకొంటామని పాఠశాల డైరక్టర్ సి.చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. పిల్లలు జాతి సంపదగా భావించి వారి భవిష్య్తత్ కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని నెహ్రూ సూచించారని, వారి ఆదర్శాలను ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరమెంతో ఉందన్నారు. బాలల దినోత్సవం సందర్బంగా గురువారం పాఠశాలలో విద్యార్థులకు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ మంజూలరెడ్డి మరియు ఉపాధ్యాయులు పాల్గోన్నారు.