ప్రమాదానికి గురైన టాలీవుడ్ హీరో రాజశేఖర్‌ కారు

0
50

మనఛానల్‌ న్యూస్‌ – హైదరాబాద్‌
ప్రముఖ టాలీవుడ్‌ హీరో,యాంగ్రీయంగ్‌ మెన్‌ డాక్టర్‌ రాజశేఖర్‌ మరోసారి రోడ్డు ప్రమాదం నుంచి సురక్షితంగా తప్పించుకున్నారు.ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.ఈ ప్రమాదం నుంచి ఆయన క్షేమంగా బయటపడ్డారు.రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ రోడ్ ఔటర్ రింగ్ రోడ్డులో మంగళవారం అర్ధరాత్రి ఈ దుర్ఘటన జరిగింది. రామెజీఫిల్మ్‌ సిటీ నుంచి తన కారులో ఇంటికి వస్తుండగా కారు టైరు పగిలి డివైడర్‌ను ఢీకొని,కారు పల్టీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.కారులోని ఎయిర్‌బ్యాగ్స్‌ సకాలంలో తెరుచుకోవడంతో ఆయన ప్రమాదం నుంచి బయటపడ్డారు.

కారులో రాజశేఖర్‌ ఒక్కరే ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాదం తర్వాత రాజశేఖర్ మరో కారులో వెళ్లి పోయినట్టు సమాచారం.ఆయనకు ఎటువంటి గాయాలు కాలేదని,ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటు న్నారని కుటుంబ సభ్యులు వెల్లడించారు.రెండేళ్ల క్రితం పీవీఎన్‌ఆర్‌ ఎయిర్‌పోర్ట్‌ ఎక్స్‌ప్రెస్‌వేలో జరిగిన రోడ్డు ప్రమాదం నుంచి రాజశేఖర్‌ బయటపడ్డారు.తన కారుతో మరొకరి వాహనాన్ని ఆయన ఢీకొట్టారు. అయితే బాధితుడు రామిరెడ్డితో వివాదం పరిష్కరించుకోవడంతో పోలీసులు నమోదు చేయలేదు. క్రియేటివ్‌ ఎంటర్‌టైనర్స్‌ అండ్‌ డిస్ట్రిబ్యూటర్స్‌ పతాకంపై జి.ధనుంజయన్‌ నిర్మిస్తున్న సినిమాలో ప్రస్తుతం రాజశేఖర్‌ నటిస్తున్నారు.