మద్రాస్‌ హైకోర్టు సీజేగా ప్రమాణం చేసిన జస్టిస్‌ అమరేశ్వర్‌ ప్రతాప్‌ సాహీ

0
43

మనఛానల్‌ న్యూస్‌ – నేషనల్‌ డెస్క్‌
మద్రాస్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ అమరేశ్వర్‌ ప్రతాప్‌ సాహీ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు.జస్టిస్‌ అమరేశ్వర్‌ చేత తమిళనాడు గవర్నర్‌ భన్వరీలాల్‌ పురోహిత్‌ రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయించారు.ఈ కార్యక్రమానికి తమిళనాడు సీఎం కే పళనిస్వామి,జస్టిస్‌ వినీత్‌ కోఠారీ, జడ్జిలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే శణ్నుఘంతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.జస్టిస్‌ సాహీ పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నవంబర్‌ 17,2018న నియామకం అయ్యారు.1959,జనవరి 1వ తేదీన జన్మించిన అమరేశ్వర్‌ ప్రతాప్‌ సాహీ 1985లో న్యాయవాద పట్టా పొందారు.అలహాబాద్‌ కోర్టులో ఆయన లాయర్‌గా ప్రాక్టీస్‌ చేశారు.