కాచిగూడలో ఢీకొన్న ఎంఎంటీఎస్‌,ఇంటర్‌ సిటీ రైళ్లు – పలువురు ప్రయాణికులకు గాయాలు

0
44

మనఛానల్‌ న్యూస్‌ – హైదరాబాద్‌
ఎదురెదురుగా వస్తున్న రెండు మెట్రో రైళ్లు ఢీకొని పలువురు ప్రయాణికులకు తీవ్రంగా గాయపడిన సంఘటన హైదరాబాద్‌లోని కాచిగూడ రైల్వే స్టేషన్‌ వద్ద జరిగింది.సిగ్నల్‌ను చూసుకోకపోవడంలో ఒక ఎంఎంటీఎస్‌,ఇంటర్‌ సిటీ రైళ్లు ఒకే ట్రాక్‌పైకి రావడంతో ప్రమాదం చోటుచేసుకుంది.కాచిగూడలోని రెండు రైళ్లు ఒకదానికొకటి మరొకటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో చాలా మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.

వీరిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు అధికారులు. అంతేకాకుండా.. రెండు బోగీల మధ్య లొకో పైలట్ చిక్కుకున్నాడు. సిగ్నల్ చూసుకోకుండా ఒకే ట్రాక్‌పైకి రెండు రైళ్లు రావడంతో ఈ పెను ప్రమాదం జరిగింది. ఒక ఎంఎంటీఎస్ ట్రైన్.. మరొక కర్నూల్ ఇంటర్‌ సిటీ ట్రైన్ రెండు ఢీ కొన్నాయి.రెండు రైళ్లు ఒకేసారి ఢీ కొనడంతో బోగీలు పక్కకు ఒరిగాయి.దీంతో ప్రస్తుతం అటు నుంచి ఇటు నుంచి వచ్చే రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ఈ ప్రమాద ఘటనతో ఒకేసారి అక్కడి ప్రయాణికులు భయాందోళన చెందారు. వెంటనే ప్రమాదఘటన ప్రాంతానికి  రైల్వే పోలీసులు చేరి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిస్తున్నారు. సాధారణంగా.. బస్సులు, స్కూటీల లాంటి రోడ్డు ప్రమాదం చూస్తుంటాము కానీ.. ఇలాంటి రైళ్ల లాంటి ప్రమాదం జరగడం చాలా అరుదు. ఏదేమైనా.. ఉద్యోగుల నిర్లక్ష్యానికి ఈ ప్రమాదం అద్దం పడుతోంది.