ముహుర్తానికి ముందే పెళ్లి మంటపంలో వరుడు ఉరేసుకొని ఆత్మహత్య..!!

0
86
advertisment

మనఛానల్ న్యూస్ – హైదరాబాద్
కొద్ది క్షణాలలో పెళ్లి జరుగబోనుంది..బంధువులు అందరూ పంక్షన్ హాలులోకి వస్తున్నారు…ముహర్తానికి అంతా సిద్దమౌతున్న వేళ ఉహించని విధంగా పెళ్లి కుమారుడు పెళ్లి మంటపంలోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోవడం తెలంగాణలో సంచలనాన్ని రేపింది. తెలంగాణలోని మేడ్చల్ జిల్లా కోంపల్లిలో హైదరబాద్ దిల్ సుఖ్ నగర్ చెందిన సందీప్ అనే సాప్ట్ వేర్ ఇంజనేర్ తో స్థానికంగా ఉంటున్న ఓ యువతితో కొంపల్లిలోని ఓ పంక్షన్ హాలులో ఆదివారం వివాహం జరగాల్సి ఉంది. అయితే శనివారం రాత్రి అన్ని ఏర్పాచ్లు పూర్తి చేశారు. ఆదివారం ఉదయం వివాహం సమయానికి పెళ్లి కుమారుడిని సిద్దం చేసి పెళ్లి పీటలపైకి పిలవడానికి వెళ్లగ పంక్షన్ హాలులో పెళ్లికుమారుడిని సిద్దం చేసే గదిలో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొన్నారు. విషయం తెలిసిన పెళ్లి వారు షాక్ కు గురయ్యారు. పెళ్లి మంటపంలో ఆనందంగా ఉండాల్సిన బంధువులు విషణ్ణ వదనాలతో బోరున విలపించాల్సి వచ్చింది. విషయం తెలిసిన పేట్ బషీర్ బాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.