అయోద్యలో రామాలయం నిర్మాణంలో ముస్లీం సోదరులు చేయాత – మెఘలు సామ్రాజ్య చివరి రాజు వంశీయుడి అకాంక్ష

0
38
advertisment

మనఛానల్ న్యూస్ – నేషనల్ డెస్క్
అయోద్యలోని వివాదస్పద బాబ్రీమసీద్ – రామజన్మభూమి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మెుఘల సామ్రాజ్య చిట్ట చివరి రాజు బహుదూర్ షా వంశీయులు స్వాగతించారు. సుప్రీం తీర్పు అందరికి శీరోదార్యమన్నారు. ఇది చారిత్రత్మక తీర్పుగా వర్ణించారు.మెుఘలు సామ్రాజ్య చిట్టచివరి రాజు బహుదూర్ షా వంశీయుడైన ప్రిన్స్ యూకుబ్ హబీబుద్దీన్ టుచి ఎ.ఎన్.ఐ వార్త సంస్థతో మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం అయోద్యలో నిర్మించే రామాలయం నిర్మాణంలో ముస్లీములు పాల్గోని సోదరభావాన్ని చాటుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీని ద్వారా భారత దేశంలోని లౌకిక వాదాన్ని ప్రపంచానికి చూపాలని కోరారు. అయోద్యలో నిర్మించే రామాలయానికి తాను బంగారు ఇటుకను అందిస్తానని తెలిపారు. త్వరలో భారత ప్రధాని నరేంద్ర మోదికి బంగారు ఇటుకను అందచేస్తానని తెలిపారు. అనేక ఏళ్లతరబడి అపరిష్కృతంగా నున్న అయోద్య కేసును సుప్రీంకోర్టు తన చారిత్రాత్మక తీర్పుతో సమస్యకు ముగింపు పలకడం పట్ల ప్రిన్స్ యాకుబ్ హర్షం వ్యక్తం చేశారు