స్వయం పరీక్షలో మిట్స్ విద్యార్థులు ప్రతిభ

0
87

మనఛానల్ న్యూస్ – మదనపల్లి
చిత్తూరు జిల్లా మదనపల్లిలోని మిట్స్ ఇంజనేరింగ్ కాలేజీ విద్యార్థులు జాతీయ స్థాయిలో నిర్వహించే స్వయం పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయిలో టాపర్స్ గా నిలిచారని మిట్స్ కళశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి. యువరాజ్ ఓ ప్రకటనలో తెలిపారు. నేషనల్ ప్రోగ్రాం ఆన్ టెక్నాలజీ ఎన్హాన్స్డ్ లెర్నింగ్ సంస్థ మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాసు వారు సంయుక్తంగా ఏటా ప్రతి సెమిస్టర్ ప్రారంభంలో స్వయం పేరుతో నిర్వహించే ఆన్లైన్ పరిక్షలలో మిట్స్ లో విద్యాబ్యాసం చేస్తున్న సునీల్ కుమార్ (బి.టెక్ మూడవ సంవత్సరము కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్) మరియు చిన్మయి సాయి (బి.టెక్ మూడవ సంవత్సరము కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)లు జాతీయ స్థాయీ లో టాప్పర్ లు గా నిలిచినట్లు ఆయన తెలిపారు. వీరు జాతీయ స్థాయీ లో ఇంట్రడక్షన్ టూ ఆపరేటింగ్ సిస్టం అనే అంశం పై నిర్వహించిన స్వయం పరీక్షలో అత్యధిక మార్కులతో టాపర్లు గా నిలిచారన్నారు. ఈ పరీక్షకు జాతీయ స్థాయిలో దేశం లోని అన్ని రాష్ట్రాల నుంచి విద్యార్థులు మరియు అధ్యాపకులు పాల్గొంటారని తెలిపారు. జాతీయ స్థాయీ లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్ డాక్టర్ సి. యువరాజ్, కోఆర్డినేటర్ డాక్టర్. అరుళ్ కుమార్, అధ్యాపక బృందం మరియు విద్యార్థులు అభినందనలు తెలియజేసారు.