వివాదస్పద స్థలంలో రామాలయం – ప్రత్యామ్నాయ స్థలంలో మసీదు నిర్మాణం – సుప్రీం చారిత్రాత్మక తీర్పు

0
53
advertisment

మనఛానల్ న్యూస్ – నేషనల్ డెస్క్
దేశ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠభరితంగా ఎదురుచూస్తున్న బాబ్రీ మసీదు – రామజన్మభూమి కేసుపై సుప్రీంకోర్టు తన చారిత్రాత్మకమైన తీర్పును శనివారం వెలువరించింది. బాబ్రీ మసీదు కూల్చివేతను సుప్రీంకోర్డు తప్పుపట్టింది. చట్టవిరుద్దమని తెల్పింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తుది తీర్పు చెప్పింది. 2.77 ఎకరాల స్థలం హిందువులకే చెందుతుందని తేల్చిచెప్పేసింది. వివాదాస్పద స్థలానికి సంబంధించి 3 నెలల్లో కేంద్రం ట్రస్ట్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించింది.  మూడునెలల్లోగా అయోధ్యట్రస్ట్‌ను ఏర్పాటు చేసి ఈ భూమిని ఆ ట్రస్ట్‌కు కేటాయించానిల సూచించింది.అదేవిధంగా సున్నీ వక్ఫ్‌ బోర్డుకు 5 ఎకరాల భూమిని కేటాయిస్తూ తీర్పు లో పేర్కొంది.ఇక మసీదు నిర్మాణానికి మరో చోట స్థలాన్ని కేటాయించాలని కేంద్రాన్ని కోరింది. మసీదు నిర్మాణం ఖాళీ స్థలంలో జరుగలేదని,మసీదు నిర్మాణం కింద ఆలయ నిర్మాణం ఆనవాళ్లు ఉన్నాయనే పురవాస్తు శాఖ నివేదికను సుప్రీంకోర్టు ఆమోదించింది. .బాబ్రీ మసీదు నిర్మాణం ఖాళీ స్థలంలో జరగలేదని అది మందిరం పైన నిర్మాణం జరిగినందున ఆస్థలాన్ని అయోద్య ట్రస్టుకు అప్పగించి రామాలయాన్ని నిర్మించాలని కోర్టు తీర్పు ఇచ్చింది.