అయోధ్య కేసుపై సుప్రీం తుది తీర్పు – దేశవ్యాప్తంగా హైఅలర్ట్‌…లైవ్‌అప్‌డేట్స్‌

0
58
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – నేషనల్‌ డెస్క్‌

Related image

దేశంలో శాంతి సామరస్యాలు వెల్లువెరిసేలా సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని ప్రముఖ యోగ గురువు, పతంజలి సంస్థ స్థాపకులు బాబా రాందేవ్ తెలిపారు. తీర్పును స్వాగతిస్తున్నామని అన్నారు.

బాబ్రీ మసీదు- రామజన్మభూమి సమస్యను సుప్రీంకోర్టు శనివారం ఇచ్చిన తీర్పుతో పరిష్కారమైందని, ఈసమస్య ముగిసిపోయిందని ఆర్.ఎస్.ఎస్. చీప్ మెహన్ భగవత్ పేర్కొన్నారు.

దశాబ్దాలుగా అపరిష్కృతముగానున్న సమస్యకు పరిష్కారం దొరికిందని భారత ప్రధాని నరేంద్రమోది ట్విట్టర్ లో ప్రకటించారు.

వివాదస్పదబాబ్రీ మసీదు – రామ జన్మభూమి కేసులో సుప్రీం కోర్టు తీర్పుపై హార్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ వ్యవస్థాపకుడు పండిట్ శ్రీశ్రీశ్రీ రవిశంకర్ స్పందించారు. ప్రపంచంలోనే అత్యంత చారిత్రాత్మకమైన తీర్పును సుప్రీంకోర్టు వెలువరించిందని అన్నారు.

వివాదస్పద బాబ్రీ మసీదు – రామ జన్మభూమి కేసుపై సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో దేశ వ్యాప్తంగా అలర్ట్ ప్రకటించారు.

Embedded video

సుప్రీంకోర్టు తీర్పు మమ్ములను నిరాశపర్చింది. అయినా సుప్రీం కోర్టు తీర్పును గౌరవిస్తాం – ఆలిండియా ముస్లీం పర్సనల్ లా బోర్డు ప్రకటన

1045 పేజీలలో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.

భారతదేశ చరిత్రలో అత్యంత సుదీర్ఘమైన చారిత్రత్మక తీర్పుగా న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు.

వివాదస్థలంలో రామమందిరాన్ని నిర్మించుకోవచ్చు : సుప్రీం తీర్పు

advertisment

అయోధ్య కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది.రామమందిరం ` బాబ్రీ మసీదు కేసు విషయంలో ఐదుగురు జడ్జిలతో కూడిన ధర్మాసనం వివాద స్థలమైన 2.77 ఎకరాల్లో రామమందిరాన్ని నిర్మించుకోవచ్చునని తెలిపింది.మూడునెలల్లోగా అయోధ్యట్రస్ట్‌ను ఏర్పాటు చేసి ఈ భూమిని ఆ ట్రస్ట్‌కు కేటాయించానిల సూచించింది.అదేవిధంగా సున్నీ వక్ఫ్‌ బోర్డుకు 5 ఎకరాల భూమిని కేటాయిస్తూ తీర్పు లో పేర్కొంది.ఇక మసీదు నిర్మాణానికి మరో చోట స్థలాన్ని కేటాయించాలని కేంద్రాన్ని కోరింది. మసీదు నిర్మాణం ఖాళీ స్థలంలో జరుగలేదని,మసీదు నిర్మాణం కింద ఆలయ నిర్మాణం ఆనవాళ్లు ఉన్నాయనే పురవాస్తు శాఖ నివేదికను సుప్రీంకోర్టు ఆమోదించింది.

షియావక్ఫ్‌బోర్డు పిటిషన్‌ కొట్టివేసిన ధర్మాసనం

అయోధ్యకేసులో షియావక్ఫ్‌బోర్డు దాఖలు చేసిన పిటిషన్‌ ఐదుగురు జడ్జితో కూడిన ధర్మాసనం కొట్టివేసింది.ఆ పిటిషన్‌లో మొగల్‌ చక్రవర్తి బాబర్‌ బాబ్రీ మసీదును నిర్మించాడని షియావక్ఫ్‌బోర్డు పేర్కొంది.అయితే దీనిని సుప్రీం తోసిపుచ్చింది.దీంతో సున్నీ వక్ఫ్‌ బోర్డుకు అనుకూలంగా తీర్పును వెల్లడించింది.బాబర్‌ దగ్గర పనిచేసే మంత్రులు బాబ్రీ మసీదును నిర్మించారని పేర్కొంది. రామ్‌లల్లా, విరాజ్‌మాన్‌కు అనుకూలంగా,నిర్మోహి అఖాడాకు వ్యతిరేకంగా తీర్పు వెలువరించింది.ఇకపోతే రాముడు అయోధ్యలోనే జన్మించడాని,అయితే మసీదు నిర్మాణం కోసం ఆలయాన్ని కూల్చివేశారనే దానికి ఎలాంటి సాక్ష్యాలు లేవని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.వివాదస్థలలో ప్రార్థనలు చేసే అదికారం నిర్మోహి అఖాడాకు లేదని పేర్కొంది.మొత్తం తీర్పును చదవడానికి అర్థగంట పడుతుందని జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ తెలిపారు.


నేడు మరో చారిత్మ్రకమైన కేసులో సుప్రీం తుదితీర్పు ఇవ్వనుంది.అయోధ్య కేసులో ఐదుగురు జడ్జితో కూడిన ధర్మాసనం శనివారం 10.30 గంటకు అంతిమతీర్పు వెలువరించనుంది.దీంతో దశాబ్దాల వివాదానికి నేడు తెరపడనుంది. దేశ రాజకీయ సమీకరణాల్లో కీలక మార్పులకు కారణమైన జటిల సమస్యకు నేడు పరిష్కారం లభించనుంది. అయోధ్యలోని వివాదాస్పద భూభాగంపై యాజమాన్య హక్కులు ఎవరికి లభిస్తాయో నేడు తేలనుంది.

రాజకీయంగా అత్యంత సున్నితమైన అయోధ్యలోని రామ జన్మభూమి– బాబ్రీ మసీదు భూ యాజ మాన్య వివాదంపై నేడు తుది తీర్పు వెలువడనుంది.ఉదయం పదిన్నర గంటలకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసులో కీలక తీర్పును వెలువరించనుంది.దీనికి సంబంధించిన నోటీసును శుక్రవారం రాత్రి సుప్రీంకోర్టు వెబ్‌ సైట్‌లో అప్‌లోడ్‌ చేశారు.సుప్రీంకోర్టు చరిత్రలో రికార్డు స్థాయిలో దాదాపు 40 రోజుల పాటు క్రమం తప్పకుండా ఈ కేసు విచారణ కొనసాగింది.

అక్టోబర్‌ 16న వాదనలు వినడం ముగించిన జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే,జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ అశోక్‌ భూషణ్,జస్టిస్‌ ఎస్‌ఏ నజీర్‌ కూడా సభ్యులుగా ఉన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. తీర్పు నేపథ్యంలో దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు.దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని సున్నిత ప్రాంతాల్లో భద్రతా బలగాలను మోహరించారు.