చిన్నారి వర్షిత కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ

0
127

మనఛానల్ న్యూస్ – మదనపల్లి
చిత్తూరు జిల్లా మదనపల్లికి సమీపంలో గురువారం బంధువుల పెళ్లికి వెళ్లిన చిన్నారి వర్షితను కిడ్నాప్ చేసి అతి కిరాతకంగా హత్య చేసిన సంఘటనను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకొంది. సంఘటన తెలిసిన తక్షణమే స్పందించిన రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ శనివారం హత్యకు గురైన వర్షిత కుటుంబాన్ని బి.కోత్తకోట మండలం గుట్టపాళానికి వెళ్లి పరామర్శించారు.వర్షిత తల్లిదండ్రులను ఓదార్చారు. చిన్నారి హత్య సంఘటనపై ఆమె తీవ్రంగా స్పందించారు. హంతకులపై కఠిన చర్యలు తీసుకొంటామని పేర్కొంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండ పటిష్టమైన చర్యలు తీసుకొంటామని తెలిపింది. బాధిత కుటుంబానికి అండంగా నిలుస్తామన్నారు. పోలీసు విచారణ వేగవంతంగా జరుగుతోందని తెలిపారు. ఆమెవెంట తంభళ్లపల్లి ఎం.ఎల్.ఏ పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి గుట్టపాళం గ్రామానికి వెళ్లారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి కిరాతకాలకు పాల్పడే వారికి తీవ్రంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. హంతకులను త్వరగా పట్టుకోవాలని పోలీసులను విజ్ఞప్తి చేశారు.

స్థానికులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మమరియు తంభళ్లపల్లి శాసనసభ్యులు పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, ఎస్టీయు రాష్ట్ర ఉపాధ్యక్షులు పురుం ఢిల్లీప్రసాద్ తదితరులు

ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల ఆందోళన
బి.కోత్తకోట మండలం గుట్టపాళెం ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతి చదువుతున్న చిన్నారి వర్షితని అతి కిరాతకంగా హత్య చేయడాన్ని బి.కోత్తకోట మండలంలోని ఉపాధ్యాయులు ఖండిస్తూ నిరసన చేపట్టారు. బాలికను హత్య చేసిన దుండగులను తీవ్రంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం గుట్టపాళెం గ్రామానికి వచ్చిన రాష్ట్ర మహిళ కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మను రాష్టోపాధ్యాయ సంఘం (ఎస్.టి.యు) ఉపాధ్యక్షులు పురుం ఢిల్లీప్రసాద్ ఆధ్వర్యంలో మండలంలోని ఉపాధ్యాయులతో కలిసి వినతి పత్రం సమర్పించారు. బాలికను కిరాతకంగా హత్యచేసిన వారిని ఉరితీయాలని డిమాండ్ చేశారు. అంతకు మునుపు ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానికులు బాలిక హత్యను నిరసిస్తూ ర్యాలీ నిర్వహించారు.

వర్షితహత్యను నిరసిస్తూ విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్థానికులచే నిరసన ర్యాలీ

బి.కోత్త కోట మండల ఉపాధ్యాయుల తరపున మహిళ కమిషన్ ఛైర్ పర్సన్ కు సమర్పించిన వినతి పత్రం