కర్తార్‌పూర్‌ కారిడార్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

0
15
advertisment

మనఛానల్ న్యూస్ – నేషనల్ డెస్క్
కర్తార్‌పూర్‌ కారిడార్‌ను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ గురునానక్‌ 550వ జయంతికి ముందుగానే కర్తార్‌పూర్‌ కారిడార్‌ను ప్రారంభించు కోవడం సంతోషంగా ఉందన్నారు.ఇందుకు సహకరించిన పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు ధన్యవా దాలు తెలిపారు.ఇమ్రాన్‌ ఖాన్‌ భారతీయుల సంప్రదాయాలను గౌరవించడం మంచి పరిణామం అని మోదీ పేర్కొన్నారు.కర్తార్‌పూర్‌ కారిడార్‌ ప్రారంభోత్సవానికి కృషి చేసిన పంజాబ్‌ ప్రభుత్వం,శిరోమణి గురుద్వార ప్రబంధక్‌ కమిటీకి కూడా మోదీ ధన్యవాదాలు చెప్పారు.

ఈ నెల 12వ తేదీన గురునానక్ 550వ జయంతి వేడుకలు నిర్వహించనున్నారు.సిక్కుల మ‌త గురువు గురు నాన‌క్‌కు చెందిన గురుద్వారా ద‌ర్బార్ సాహిబా ప్ర‌స్తుతం పాకిస్థాన్‌లో ఉన్న‌ది.అయితే ప్ర‌తి రోజూ 5 వేల మంది సిక్కులు ఆ గురుద్వార్ వెళ్లేందుకు పాకిస్థాన్ అనుమ‌తి ఇచ్చింది.గురు నాన‌క్ త‌న చివ‌రి 18 ఏళ్ల జీవితాన్ని గురుద్వారా ద‌ర్బార్ సాహిబ్‌లోనే గ‌డిపారు.పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్సులో ఉన్న న‌రోవ‌ల్ జిల్లాలో ఈ గురుద్వారా ఉన్న‌ది.ఇది అంత‌ర్జాతీయ స‌రిహ‌ద్దుకు కేవ‌లం నాలుగు కిలోమీట‌ర్ల దూరంలో ఉంది.