ఐదేళ్ల జీతాన్ని ఏపీ అభివృద్ధికి ఇచ్చిన ఎమ్మెల్యే…ఎవరో తెలుసా…!

0
33
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – అమరావతి
తన జీతభత్యాల్ని మొత్తం ‘కనెక్ట్‌ టు ఆంద్రా’కు ఇస్తున్నట్లు గుంటూరుజిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) తెలిపారు.ఈమేరకు అసెంబ్లీ కార్యదర్శికి లిఖిత పూర్వకంగా లేఖ అందజేశారు. సీఎం వైఎస్‌ జగన్‌ అమలు చేస్తున్న నవరత్నాలు,ఇతర సంక్షేమ పథకాల అమలుకు తనవంతు సాయంగా తనకు వచ్చే జీతభత్యాలను మొత్తం ప్రభుత్వానికి విరాళంగా అందజేస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు.

ఈ విషయాన్ని వైఎస్ఆర్సీపీ ఫేస్‌బుక్ ద్వారా వెల్లడించింది.ప్రభుత్వ పథకాలు,అభివృద్ధి కార్యక్రమాలకు ప్రవాసాంధ్రులు,స్వచ్ఛంద సంస్థలు,ఇతర దాతలు భాగం కావడం కోసం ఏపీ సీఎం జగన్ ‘కనెక్ట్ టూ ఆంధ్రా’ వెబ్ పోర్టల్‌ను ప్రారంభించారు.దీని ద్వారా తమ సొంత ఊళ్లలో అమలవుతున్న నవరత్నాలు, నాడు-నేడు,ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు సహాయం చేయవచ్చని జగన్ తెలిపారు.కనెక్ట్ టూ ఆంధ్రా ద్వారా వెయ్యి కోట్ల రూపాయలను సమీకరించాలని సీఎం భావిస్తున్నారు.