ఉద్రిక్తతకు దారితీసిన ఛలో ట్యాంక్‌బండ్‌ – పోలీసులపై రాళ్లు విసిరిన కార్మికులు

0
57

మనఛానల్‌ న్యూస్‌ – హైదరాబాద్‌
సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు తపెట్టిన సమ్మె 36వ రోజుకు చేరుకుంది.36వ రోజైన శనివారం ఛలోట్యాంక్‌బండ్‌ కార్యక్రమానికి పిలుపునిచ్చింది.ఇందులో భాగంగా చలో ట్యాంక్ బండ్ ఆందోళనలో పాల్గొనేందుకు వచ్చిన ఆర్టీసీ కార్మికులు కదం తొక్కారు.బారికేడ్లను తోసుకుని ట్యాంక్‌ బండ్‌పైకి పరుగులు తీశారు.

వీరిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై రాళ్లు రువ్వారు.భారీ సంఖ్యలో కార్మికులు తరలి రావడంతో వీరిని అడ్డుకోవడం పోలీసుల వల్ల కాలేదు.దీంతో ఆందోళనకారులపై పోలీసులు లాఠీలు ఝుళిపించారు.ప్రభుత్వం తమ కడుపు కొడుతోందంటూ కార్మికులు సర్కారుపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు.చలో ట్యాంక్ బండ్ ఆందోళనలో పాల్గొనేందుకు వచ్చిన ఆర్టీసీ మహిళా కార్మికులను పోలీసులు అడ్డుకోవడంతో తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ సందర్భంగా పోలీసులు, కార్మికులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.20 మంది ఆర్టీసీ కార్మికులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని గోషామహల్ స్టేషన్‌కు తరలించారు.కాగా,చలో ట్యాంక్ బండ్ నేపథ్యంలో ఇప్పటి వరకు 170 మందిని అరెస్ట్ చేసినట్టు నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ తెలిపారు.ఆర్టీసీ జేఏసీ నాయకులు,రాజకీయ పార్టీలకు చెందిన నాయకులను ముందస్తు అరెస్టులు చేసినట్టు వెల్లడించారు.ట్యాంక్ బండ్‌పై ప్రశాంత వాతావరణం ఉందన్నారు.