అయోధ్య తీర్పుతో న్యాయవ్యవస్థపై మరింత విశ్వాసం – మోదీ వరుస ట్వీట్లు

0
22
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – నేషనల్‌ డెస్క్‌
అయోధ్య తీర్పుతో భారత న్యాయవ్యవస్థపై ప్రజలకు మరింత విశ్వాసం పెరిగిందని భారత ప్రధాని మోడీ వెల్లడించారు.అయోధ్య రామజన్మభూమి- బాబ్రీ మసీదు వివాదంలో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు చట్టం ముందు అందరూ సమానులే అనే విషయాన్ని మరోసారి నిరూపించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇరుపక్షాల వాదనలను పూర్తిగా విని సరైన సమయం తీసుకున్న తర్వాతే చరిత్రాత్మక తీర్పు వెలువడిందన్నారు.

దశాబ్దాలుగా నలుగుతున్న సమస్యను సుప్రీంకోర్టు పరిష్కరించిన తీరుతో ప్రజల్లో న్యాయ వ్యవస్థ పట్ల విశ్వాసం మరింత పెరుగుతుందన్నారు.కీలక తీర్పు వెలువడిన నేపథ్యంలో 130 కోట్ల మంది భారతీ యులు సంయమనం పాటించి శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా చూడాలని విఙ్ఞప్తి చేశారు.ఈ మేరకు అయోధ్య వివాదంలో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.ఈ తీర్పును ఏ ఒక్కరి విజయంగానో మరొకరి పరాజయంగానో భావించరాదు.రామ భక్తులైనా,రహీం భక్తులైనా దేశభక్తి భావనను పెంపొందించుకోవాలి.

అప్పుడే శాంతి,సౌఖ్యాలు వర్థిల్లుతాయి.ఇది చరిత్రాత్మక తీర్పు.సహృద్భావ వాతావరణంలో ఈ సమస్య పరిష్కరించబడింది.న్యాయ వ్యవస్థలోని స్వతంత్రత,పారదర్శకత,దూరదృష్టి మరోసారి తేటతెల్లమైంది. చట్టం ముందు అందరూ సమానులే అని తేల్చింది. ఐకమత్యంతో అందరం ముందుకు సాగుతూ జాతి అభివృద్ధిలో ప్రతీ భారత పౌరుడి అభివృద్ధికి పాటుపడాలి అని నరేంద్ర మోదీ హిందీ,ఇంగ్లీష్‌ భాషల్లో వరుస ట్వీట్లు చేశారు.