35వ రోజుకు చేరుకున్న ఆర్టీసీ సమ్మె…రేపు కార్మికుల మిలియన్‌ మార్చ్‌

0
38

మనఛానల్‌ న్యూస్‌ – హైదరాబాద్‌
తమ డిమాండ్ల సాధన కోసం తెలంగాణలోని ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మె 35వ రోజుకు చేరుకుంది.సీఎం కేసీఆర్‌ విధించిన డెడ్‌లైన్‌ను సైతం లెక్కచేయకుండా కార్మికులు సమ్మె చేస్తున్న సంగతి విదితమే.ఇదిలా ఉండగా రేపు నిర్వహించనున్న మిలియన్‌ మార్చ్‌కు ఆర్టీసీ ఐకాస నేతలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ సందర్భంగా ఆర్టీసీ ఐకాస నేత అశ్వత్థామ రెడ్డి మాట్లాడుతూ హైకోర్టు కార్మికుల సమస్యల పరి ష్కారానికి చొరవ చూపాలని ప్రభుత్వాన్ని ఆదేశించడం కేసీఆర్‌ గవర్నమెంట్‌ బేఖాతారు చేయడం సమంజసం కాదన్నారు.రేపు ఆర్టీసీ యూనియన్‌ సంఘాలు నిర్వహించనున్న మిలియన్‌ మార్చ్‌కు అఖిపక్ష పార్టీలు,ప్రజా సంఘాలు,విద్యార్థి సంఘాలు తమ మద్ధతు ప్రకటించిన సంగతి తెలిసిందేన న్నారు.

తమ ధ్యేయమంతా కార్మికులకు మంచి జరగాలన్నదేనని ఆయన వివరించారు.ప్రభుత్వం మాత్రం కార్మికుల సమస్యలపై చర్చలకు పిలవకుండా కార్మికులను బెదిరింపులకు గురిచేస్తున్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.కావున ప్రభుత్వం పునరాలోచించుకొని ఆర్టీసీ ఐకాస నేతలతో చర్చలు జరిపి సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని ఆయన కోరారు.