పోలవరం నిధుల మంజూరుకు కేంద్ర ఆర్థికశాఖ ఆమోదం

0
41

మనఛానల్‌ న్యూస్‌ – నేషనల్‌ డెస్క్‌
ఆంధ్రప్రదేశ్‌ మానసపుత్రిక,జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు నిధులు విడుదలకు సంబంధించి విషయంలో కేంద్రం తీపికబురు అందించింది.ఈ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుచేసిన రూ.5,600 కోట్లలో రూ.1,850 కోట్ల విడుదలకు కేంద్ర ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది.ఈ మేరకు త్వరలో నాబార్డు నుంచి నిధులు విడుదల కానున్నాయి.అయితే తొలుత రూ.3 వేల కోట్ల వరకు ఆమోదం వస్తుందని అంచనా వేసినప్పటికీ,మరికొంత పరిశీలన తర్వాత మరిన్ని నిధులు విడుదలయ్యే అవకాశమున్నట్లు ఆర్థికశాఖ వర్గాలు వెల్లడించాయి.