ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌తో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ భేటీ

0
16
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – అమరావతి
ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో కేంద్ర ఇంధన,రసాయన శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ శుక్రవారం రాజ్‌భవన్‌లో మర్యాద పూర్వకంగా కలిశారు.రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలను ఆయనతో చర్చించారు.రాష్ట్రానికి రావాల్సిన నిధులు,ప్రాజెక్టులపై శ్రద్ధ తీసుకోవాలని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ కేంద్రమంత్రిని కోరారు.

అంతకు ముందు ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ధర్మేంద్ర ప్రదాన్‌కు మాజీ మంత్రి మాణిక్యాలరావు, పలువురు రాష్ట్రస్థాయి భాజపా నాయకులు,కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. కృష్ణాజిల్లా నాగాయలంక మండలం వక్కపట్ల వారిపాలెం గ్యాస్‌ నిక్షేపాలు వెలికితీసే ప్రాంతంలో ఫిల్లింగ్‌ స్టేషన్‌ను ధర్మేంద్ర ప్రదాన్‌ ప్రారంభించారు.