సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు ‘‘ఐకాన్‌ ఆఫ్‌ గోల్డెన్‌ జూబ్లీ అవార్డు’’

0
19
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – నేషనల్‌ డెస్క్‌
సూపర్‌స్టార్‌,తలైవా రజనీకాంత్‌కి అరుదైన పురస్కారం లభించింది.ఐఎఫ్‌ఎఫ్‌ఐ 2019 ఉత్సవంలో ఆయనను ఐకాన్ ఆఫ్ గోల్డెన్ జూబ్లీ అవార్డుతో సత్కరించనున్నారు.అలాగే విదేశీ నటి కేటగిరీలో ఫ్రెంచ్ నటి ఇసాబెల్లె హప్పెర్ట్ మరో విశేష అవార్డు దక్కింది.లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు ఆమెను వరిం చింది.50వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్‌ఎఫ్‌ఐ) 2019 అవార్డ్స్‌లో ఐకాన్ ఆఫ్ ది గోల్డెన్ జూబ్లీ అవార్డ్‌తో రజనీకాంత్‌ను సత్కరించనున్నట్లు కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి ప్రకాష్ జవదేవకర్ ట్విటర్ ద్వారా శనివారం అధికారికంగా ప్రకటించారు.

గత కొన్ని దశాబ్దాలుగా భారతీయ సినిమాకు ఆయన చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఈ అవార్డును ప్రకటించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.అలాగే ఇసాబెల్లెకు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు ప్రకటించడం సంతోషంగా ఉందని ట్వీట్‌ చేశారు.దీనిపై స్పందించిన రజనీకాంత్‌ ప్రతిష్టాత్మక గౌరవానికి తనను ఎంపిక చేసినందుకు భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు.నవంబర్ 20 నుండి 28 వరకు గోవాలో గోల్డెన్ జూబ్లీ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అవార్డుల కార్య క్రమం జరగనుంది.ఈ చలన చిత్రోత్సవంలో మహిళా దర్శకుల చిత్రాలను కూడా ప్రదర్శించనున్నారు.