జనసేన విశాఖ లాంగ్‌ మార్చ్‌కు పోలీసుల అనుమతి

0
34

మనఛానల్‌ న్యూస్‌ – విశాఖపట్నం
రాష్ట్రంలో ఇసుక కొరత కారణంగా భనవ నిర్మాణ కార్మికులు,అనుబంధ రంగాల కార్మికులు ఎదు ర్కొంటున్న ఇబ్బందులను ఎత్తిచూపే లక్ష్యంతో జనసేన రేపు విశాఖలో తలపెట్టిన ‘చలో విశాఖపట్నం’ లాంగ్‌ మార్చ్‌కు పోలీసులు అనుమతి ఇచ్చారు.ఈ విషయాన్ని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్వయంగా ట్విట్టర్‌లో తెలియజేశారు.కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు,మద్దతుదారులు రాకుండా అడ్డుకునేందుకు కొందరు కావాలని లాంగ్‌ మార్చ్‌కు అనుమతిలేదంటూ ప్రచారం చేస్తున్నారని, ఇటువంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు.

అనుకున్న విధంగా,అనుకున్న సమయానికి విశాఖలో మద్దిలపాలెం జంక్షన్‌లోని తెలుగుతల్లి విగ్రహం నుంచి జీవీఎంసీ ఎదుట ఉన్న గాంధీ విగ్రహం వరకు రెండున్నర కిలోమీటర్ల మేర ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు.కాగా వామపక్ష పార్టీలైన సిపిఐ,సిపిఎంలజ లాంగ్‌మార్చ్‌కు దూరమయ్యాయి.ఈ కార్యక్ర మానికి బీజేపిని సైతం ఆహ్వానించడమే ఇందుకు కారణంగా తెలిపింది.ఈ మేరకు సిపిఐ,సిపిఎం రాష్ట్ర నాయకులు రామకృష్ణ,మధు జనసేనానికి లేఖలు పంపారు.