సినిమా టికెట్లను విక్రయించిన హీరో విజయ్‌ దేవరకొండ

0
88

మనఛానల్‌ న్యూస్‌ – హైదరాబాద్‌
అనతికాలంలోనే తెలుగులో మంచి కథనాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్‌ దేవరకొండ. తాజాగా ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాతో నిర్మాత అవతారమెత్తాడు.ఇందులో భాగంగా ఆయన కౌంటర్‌లో కూర్చొని అభిమానులకు టికెట్లను విక్రయించాడు.పెళ్లి చూపులు చిత్రంతో విజయ్‌కు సినీ లైఫ్‌ ఇచ్చిన దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ను ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాలో హీరోగా పరిచయం చేశాడు.

కామెడీ మూవీ అయిన ఈ చిత్రం శు‍క్రవారం ‍ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సందర్భంగా విజయ్‌ ఐమాక్స్‌ థియేటర్‌లోని కౌంటర్‌లో టికెట్లు అ‍మ్మాడు.అయితే విజయ్‌ టికెట్లు అమ్ముతున‍్నట్లు విష యం తెలుసుకున్న ప్రేక్షకులు థియేటర్‌ దగ్గర గుమిగూడారు.అభిమాన హీరో చేతుల మీదుగా టికెట్లు తీసుకునేందుకుఎగబడ్డారు. రౌడీ అమ్మిన టికెట్లు సొంతం చేసుకున్న ఫ్యాన్స్‌ సంతోషం వ్యక్తం చేశారు. విజయ్‌ దేవరకొండ మొట్టమొదటిసారిగా నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది.

ఇందులో తరుణ్‌ భాస్కర్‌ నటనకు మంచి మార్కులే పడ్డాయి. కాసేపు నవ్వుకోడానికైనా ఈ సినిమాను చూడొచ్చు అని పలువురు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.సినిమా ప్రమోషన్స్‌ను ఇలా భిన్నంగా కూడా చేయవచ్చని విజయ్‌ నిరూపించాడు.టికెట్లు కొన్నవారికి అద్భుత ఆఫర్లు కూడా ప్రక టించాడు. టికెట్లు దక్కించుకున్న ప్రేక్షకులకు ఉచిత పాప్‌కార్న్‌ అందించాడు.