బోయకొండలో సెల్పీ తీసుకొంటూ లోయలో పడ్డ అనంతపురం జిల్లా గోరంట్ల యువకుడు ఏమయ్యాడో తెలుసా…???

0
690

మనఛానల్ న్యూస్ – మదనపల్లి
చిత్తూరు జిల్లాలో అత్యంత శక్తివంతమైన బోయకొండ గంగమ్మ తల్లి దర్శనానికి వచ్చిన ఓ యువకుడు మంగళవారం అక్కడ అందాలను తన స్మార్ట్ ఫోన్ లో బంధించుకోవడానికి ఆనందంతో సెల్పీ తీసుకొంటూ…70 అడుగుల లోతైన లోయలో పడిపోయాడు. అయితే అతనికి అదృష్టం ఉన్నట్లు ఉంది. కేవలం గాయాలతో భయటపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బోయకొండ గంగమ్మ తల్లి దర్శనం కోసం ఏపిలో కడప, అనంతపురం జిల్లాలతో పాటు కర్నాటక నుంచి అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఇందులో భాగంగా అనంతపురం జిల్లా గోరంట్ల మండలం సోందేవపల్లికు చెందిన సతీష్ అనే యువకుడు బోయకొండ దేవాలయం సమీపంలో లోయను సెల్పీ తీసుకొనే ప్రయత్నం చేస్తుండగా పొరపాటున కాలు జారీ లోయలో పడిపోయాడు. దీనిని గమనించిన భక్తులు వెంటనే దేవాలయం సిబ్బందికి సమాచారం ఇవ్వగా, వారు 108,ఫైర్ సిబ్బంది, రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు. స్థానిక భక్తులు, దేవాలయ సిబ్బంది సహాకరంతో ఫైర్ సిబ్బంది లోయలో పడ్డ యువకుడిని మైదాన ప్రాంతానికి తీసుకొచ్చారు. గాయపడ్డ సతీష్ ను 108 వాహనంలో సమీపంలోని పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యువకుడు ప్రాణాలతో భయటపడడంతో భక్తులు ఊపిరి పీల్చుకొన్నారు.