ధన త్రయోదశి వేళ…పసిడి ధరలకు కళ

0
338

మనఛానల్‌ న్యూస్‌ – బిజినెస్‌ డెస్క్‌
ధన త్రయోదశితోపాటు పెళ్లిళ్ల సీజన్‌ కూడా దగ్గర పడుతుండటంతో పసిడి ధరలకు మళ్లీ రెక్కలొ చ్చాయి.దీంతో శుక్రవారం దేశీయ మార్కెట్లలో కొనుగోళ్లు ఊపందుకున్నాయి.దీంతో బంగారం ధర మళ్లీ 39 వేల మార్క్‌ను దాటింది.నేటి బులియన్‌ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.220 పెరిగి రూ.39,240 పలకడం విశేషం.

అటు వెండి కూడా నేడు బంగారం దారిలోనే పయనించింది.ఇవాళ ఒక్కరోజే రూ.670 పెరగడంతో కేజీ వెండి ధర రూ.47,680కి చేరింది.ధన త్రయోదశి రోజున బంగారం,వెండి అభరణాలను కొనుగోలు చేస్తే మంచిదని చాలా మంది నమ్ముతుంటారు.ఇదిలా ఉండగా మరికొద్ది రోజుల్లో పెళ్లిళ్ల సీజన్‌ ప్రారంభం కానున్నది.

దీంతో దేశీయ కొనుగోళ్లు పెరిగాయి.అటు అంతర్జాతీయ మార్కెట్లలో గత కొన్నిరోజులుగా నెలకొన్న అనిశ్చితి కారణంగా పసిడిలో పెట్టుబడులు పెట్టడమే శ్రేయస్కరమని మదుపర్లు భావిస్తున్నారు.దీంతో రానున్న రోజుల్లో బంగారం,వజ్రాల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపార విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.