రాయల్‌ వశిష్ట ఆపరేషన్‌ సక్సెస్‌ – బోటును వెలికితీసిన సత్యం బృందం

0
158

మనఛానల్‌ న్యూస్‌ – తూర్పు గోదావరి
ఎట్టకేలకు రాయల్‌ వశిష్ట ఆపరేషన్‌ సక్సెస్‌ అయ్యింది.గోదావరి నదిలో మునిగిన ఈ బోటును బయ టికి తీసేందుకు రెండో ప్రయత్నంలో సఫలమైంది ధర్మాడి సత్యం బృందం.నది ఉధృతంగా ప్రవహించడం తోపాటు వాతావరణం అనుకూలించకపోవడంతో మొదటి ప్రయత్నంలో విఫలమైన సంగతి తెలిసిందే. అయితే రెండోసారి రంగంలోకి దిగిన ధర్మాడి సత్యం బృందం స్కూబా డ్రైవర్లు తీవ్రంగా కృషిచేసి సోమ వారం దాన్ని బయటకు తీశారు.

మరో రెండు గంటల్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు.గత నెల 15న పర్యాటకులతో వెళ్తున్న బోటు మునిగిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో అందులో 77 మంది ప్రయాణిస్తున్నారు.వీరిలో 39 మంది మృతిచెందగా 12 మంది గల్లంతయ్యారు.26 మంది సురక్షితంగా బయటపడ్డారు.బోటును బయటకు తీయడంతో గల్లంతైన 12 మంది అచూకీ లభించే అవకాశముందని అధికారులు భావిస్తు న్నారు.