14వ రోజుకు చేరుకున్న ఆర్టీసీ సమ్మె – నేడు హైకోర్టులో విచారణ

0
25
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – హైదరాబాద్‌
ఆర్టీసీ సమ్మె విషయంలో అటు ప్రభుత్వం కాని,ఇటు కార్మిక సంఘాలు కాని ఏ మాత్రం తగ్గడం లేదు. కార్మికులు రోజు రోజుకు సమ్మెను మరింత ఉదృతం చేస్తుండగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగ కుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. బస్సుల సంఖ్యను పెంచుతోంది. ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం మరింత శ్రద్ధ పెడుతోంది.మరోవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఉద్యోగ సంఘాలు కూడా తోడయ్యాయి.

ఇక హైకోర్టు ఆదేశం, ప్రభుత్వం తీరుపై జేఏసీ నేతలు మరోసారి చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.ప్రధానంగా కోర్టులో ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చ జరుపుతున్నట్లు సమాచారం.మధ్యాహ్నం 12 గంటలకు రామ్ నగర్ చౌరస్తా వద్ద ధూమ్ ధామ్ కార్యక్రమం నిర్వహించనున్నారు.దీంతో ఇప్పటికే అన్ని వర్గాలు బంద్‌కు సహకరిస్తామని ప్రకటించాయి.మరోవైపు ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో మరోసారి విచారణ జరగ నుంది.

గత విచారణలో పలు కీలక వాఖ్యలు చేసింది హైకోర్టు.ఆర్టీసీ ఎండీని నియమించి చర్చలు ప్రారంభిం చాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది.ఆర్టీసీ సమ్మె,ప్రజల సమస్యలపై పూర్తి వివరాలు తెలపాలని ఆదేశించింది.రేపు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నేపథ్యంలో కోర్టు విచారణ కీలకంగా మారనుంది.అయితే ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి చర్చలకు ఎలాంటి సంకేతాలు రాలేదని కార్మిక సంఘాలు వాదిస్తు న్నాయి.