సుప్రీంకోర్టు తదుపరి సీజేఐగా జస్టిస్‌ ఎస్‌.ఏ.బోబ్డే…!

0
25
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – నేషనల్‌ డెస్క్‌
భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్‌ శరద్‌ అరవింద్‌ బోబ్డే బాధ్యతలు స్వీకరించనున్నారు.ప్రస్తుత సీజేఐ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నవంబరు 17న పదవీ విరమణ చేయనున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో తన స్థానంలో నూతన సీజేఐగా జస్టిస్‌ శరద్‌ అరవింద్‌ బోబ్డే పేరును ప్రతిపాదిస్తూ కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు ఆయన లేఖ రాశారు. నియా మకానికి సంబంధించిన పత్రాలు కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

దీంతో నవంబరు 18న జస్టిస్‌ శరద్‌ అరవింద్‌ బోబ్డే ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా కొలీజియం సిఫార్సుల మేరకు సుప్రీంకోర్టు జడ్జీల నియామకం జరుగుతుందన్న విషయం తెలి సిందే.సీనియారిటీ ప్రకారం జడ్జీల నియామకం జరిపే సంప్రదాయం కొనసాగుతోంది.ఇక ప్రస్తుతం ఉన్న అత్యున్నత న్యాయస్థానం జడ్జీల్లో రంజన్‌ గొగోయ్‌ తర్వాత శరద్‌ అరవింద్‌ సీనియర్‌గా ఉన్నారు.ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు 47వ ప్రధాన న్యాయమూర్తిగా ఆయన నియామకం లాంఛనప్రాయమే కానుంది.