సమ్మెను ఎందుకు ఆపలేకపోయారు – కేసీఆర్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు

0
34
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – హైదరాబాద్‌
రెండు వారాలుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటే ఎందుకు ఆపలేకపోయారని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.సంస్థకు పూర్తిస్థాయి ఎండీని నియమించి ఉంటే సమస్య ఇంత జఠిలమయ్యేది కాదని కోర్టు తెలిపింది.అదేవిధంగా కార్మికులు నెరవేర్చాంటున్న డిమాండ్లలో 50 శాతం న్యాయపరమై నవేనని, రేపు 10.30 గంటలకు ఆర్టీసీ కార్మిక సంఘాలను చర్చలకు పిలవాలని ప్రభుత్వాన్ని ఆదే శించింది.

ఇకపోతే కార్మికులకు ఆరోగ్యశ్రీ కార్డులు మంజూరు చేయడంలో ప్రభుత్వానికి తలెత్తే ఇబ్బందేంటని,వారి ఆరోగ్యానికి భద్రత కల్పించాలని తెలిపింది.తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రిని అభివృద్ధి చేయాలని సూచిం చింది.ఇక ప్రభుత్వం తరపున అడ్వొకేట్‌ జనరల్‌ మాట్లాడుతూ సంస్థకు ఎండీని నియమించినంత మా త్రానా సమస్య పూర్తిగా పరిష్కారం కాదన్నారు.అదేవిధంగా ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ఓ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారితో కమిటీని ఏర్పాటు చేశామని,చర్చలు జరుగుతున్న సమయంలోనే ఆర్టీసీ కార్మి కులు సమ్మెకు దిగారని,ఇది ఎంతవరకు సమంజసని ఏజీ హైకోర్టులో ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు.

ఏదీ ఏమైనప్పటికీ ప్రభుత్వం జోక్యం చేసుకొని కార్మికుల సమస్యల పరిష్కరానికి ఒక్క అడుగు ముందు కేసి,సమ్మెను ఆపేందుకు కృషి చేయాలని కోరింది.అంతేకాకుండా ఈ సమస్య ప్రభుత్వానిది, కార్మికులది కాదని…ప్రజలదని,కావున ప్రజ సమస్యలను తీర్చడమే ప్రభుత్వాల యొక్క ప్రథమ కర్తవ్యమని హైకోర్టు వెల్లడించింది.