డెంగ్యూ జ్వరంతో మదనపల్లెకు చెందిన జూనియర్‌ ఆర్టిస్ట్‌ గోకుల్‌ సాయి మృతి

0
284
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – మదనపల్లె
డెంగ్యూ జ్వరంతో చిత్తూరుజిల్లా మదనపల్లె పట్టణం ఏవీ నాయుడు కాలనీకి చెందిన జూనియర్‌ టీవీ ఆర్టిస్ట్‌ గోకుల్‌ సాయి కృష్ణ శుక్రవారం మృతిచెందారు.గత కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్న గోకుల్‌ సాయికి బెంగళూరులోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్సను అందించారు.అయితే జ్వరం తీవ్రత మరింత ఎక్కువ కావడంతో ఇవాళ ఉదయం కన్నుమూశాడు.గోకుల్‌ సాయి కృష్ణ ప్రముఖ టీవీ ఛానెళ్లలో డ్రామా జూనియర్స్‌,ఆట జూనియర్స్‌ తదితర కార్యక్రమాల్లో పాల్గొని తన ప్రదర్శనతో అల రించాడు.ఎంతో చలాకీగా ఉండే జూనియర్‌ ఆర్టిస్ట్‌ గోకుల్‌ సాయి మృతిచెందడంతో మదనపల్లెలో విషాద ఛాయలు అలముకున్నాయి.