ఘనంగా అరకు వైసిపి ఎంపీ గొడ్డేటి మాధవి వివాహం

0
38
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – విశాఖపట్నం

ఆంధ్రప్రదేశ్‌ అరకు వైఎస్సార్‌సీపీ పార్లమెంట్‌ సభ్యురాలు గొడ్డేటి మాధవి పెళ్లిపీటలెక్కారు.గురువారం రాత్రి 3.15 గంటలకు (తెల్లవారితే శుక్రవారం) తన చిన్ననాటి స్నేహితుడు కుసిరెడ్డి శివప్రసాద్‌తో మాధవి వివాహం వేడుక వైభవంగా జరగనుంది.దీంతో మాధవి స్వగ్రామమైన కొయ్యూరు మండలం శరభన్నపాలెంలోనూ, ఇటు వరుడు శివప్రసాద్‌ స్వగ్రామం గొలుగొండ మండలం కృష్ణదేవిపేట గురు వారం రోజుంతా సందడి వాతావరణం నెలకొంది.

ఈ జంటను ఆశీర్వదించేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు,కార్యకర్తలు,అభిమానుల రాకతో గ్రామాలు కళకళలాడాయి. పెళ్లిబాజాలు మోగే వరకు వధూవరుల్ని ఒక చోటకి తీసుకురాకపోవడం అక్కడి సంప్రదాయం కావడంతో ముహూర్తానికి గంట ముందు పెళ్లికుమారుడిని తీసుకొచ్చారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు, నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్‌ గణేష్‌ మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబుతో పాటు పార్టీ నేతలు ఎంపీ మాధవిని ఆశీర్వదించారు.