అంతర్‌జిల్లాల రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు బి.కొత్తకోట విద్యార్థుల ఎంపిక

0
45
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – బి.కొత్తకోట
చిత్తూరుజిల్లా స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో తిరుపతిలోని ఎస్‌పిజేఎన్‌ఎం పాఠశాల మైదానంలో ఇటీవల జరిగిన అండర్‌-14 జిల్లా హాకీ జట్టు ఎంపిక ప్రక్రియలో భాగంగా మదనపల్లె డివిజన్‌ బి.కొత్తకోట మండలం బీరంగి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల నందు 9వ తరగతి చదువుతున్న ఎం.ఈశ్వర్‌, సి. విష్ణు,జి.వరలక్ష్మీలు జిల్లా జట్టుకు స్థానం సంపాదించినట్లు ప్రధానోపాధ్యాయుడు నాగమోహన్‌ రెడ్డి శుక్రవారం తెలిపారు.వీరు నవంబర్‌ మాసంలో నెల్లూరు జిల్లా నందు జరిగే 69వ అంతరాష్ట్ర చాంఫి యన్‌షిప్‌-2019 పోటీల్లో పాల్గొంటారన్నారు.

అదేవిధంగా అండర్‌-17 విభాగంలో కావేటిగారిపల్లె జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల మైదానం నందు జరిగిన జిల్లా జట్టు ఎంపికలో భాగంగా 10వ తరగతి చదువుతున్న జి.కుసుమ, జి. రెడ్డిరాణిలు బాలికల జట్టులో స్థానం సంపాదించినట్లు ఆయన వెల్లడించారు.వీరు ఈనెల 29 నుండి అనంతపురం నందు జరిగే అంతర్‌ జిల్లా రాష్ట్రస్థాయి చాంఫియన్‌షిప్‌-2019 పోటీల్లో పాల్గొంటారన్నారు. జిల్లా జట్టుకు ఎంపి కైన క్రీడాకారులైన విద్యార్థినీ,విద్యార్థులను మండల విద్యాశాఖ అధికారి రెడ్డిశేఖర్‌, పీఈటీ జలజ, ఉపా ధ్యాయులు మరియు తోటి విద్యార్థులు అభినందించారు.