సౌదీలో ఘోరరోడ్డు ప్రమాదం – 35 మంది దుర్మరణం

0
19
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – ఎన్ఆర్ఐ డెస్క్‌
సౌదీ అరేబియాలోని ప‌విత్ర న‌గ‌రం మ‌దీనా స‌మీపంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది.విదేశీయుల‌తో వెళ్తున్న ఓ బ‌స్సు మ‌రో భారీ వాహ‌నాన్ని ఢీకొట్టింది.ఈ ప్ర‌మాదంలో 35 మంది మ‌ర‌ణించారు.మ‌రో న‌లుగురు గాయ‌ప‌డ్డారు.సౌదీ అరేబియాలోని మ‌క్కా నుంచి మ‌దీనా వెళ్లే హిజ్రా రోడ్డులో ఈ ప్ర‌మాదం జ‌రిగింది.

మ‌దీనాకు 170 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న అల్ అక్కాల్ గ్రామం వ‌ద్ద బుధ‌వారం రాత్రి 7 గంట‌ల‌కు ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు అధికారులు చెప్పారు.గాయ‌ప‌డ్డ‌వారిని అల్ హ‌మ్నా హాస్ప‌ట‌ల్‌కు త‌ర‌లించారు .ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన‌వారిలో ఆసియా,అర‌బ్ దేశాల యాత్రికులు ఉన్న‌ట్లు అధికారులు చెప్పారు.ఈ దుర్ఘ‌ట‌న ప‌ట్ల అధికారులు విచార‌ణ చేప‌డుతున్నారు.