విరాట్‌ కోహ్లీ డబుల్‌ సెంచరీ – పుణె టెస్టులో భారత్‌ భారీస్కోర్‌

0
189

మనఛానల్‌ న్యూస్‌ – స్పోర్ట్స్‌ డెస్క్‌
కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ కెరీర్‌ బెస్ట్‌ డబుల్‌ సెంచరీ సాధించడంతోపాటు రహానే,జడేజాలు రాణించడంతో పుణెలో జరుగుతున్న రెండో టెస్టులో భారత్‌ 601 పరుగుల భారీస్కోరు సాధించింది.273/3 పరు గులతో రెండో రోజు ఆటను కొనసాగించిన టీమిండియాకు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ,అజింక్యా రహానేలు (59,8 ఫోర్లు) భారీస్కోరుకు పునాదులు వేశారు.178 పరుగులు జోడించిన తర్వాత 376 పరుగుల వద్ద రహానే ఔటయ్యాడు.

దీంతో కోహ్లీతో జతకట్టిన ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు.ఒకరికి మించి మరొకరు బౌండరీలు సాధిస్తూ దక్షిణాఫ్రికా బౌలర్లకు చుక్కలు చూపించారు. కోహ్లీ (254 పరుగులు 33 ఫోర్లు,2 సిక్సర్లు నాటౌట్‌), రవీంద్ర జడేజా (91 పరుగులు 8 ఫోర్లు,1 సిక్సర్‌) ఔట య్యాడు.వీరిద్దరూ 5వ వికెట్‌కు 222 పరుగులు జోడించడం విశేషం.కాగా కోహ్లీకి ఇది టెస్ట్‌ కెరీర్‌లో 7వ డబుల్‌ సెంచరీ.దీంతో భారత్‌ తరపున అత్యధిక డబుల్‌ సెంచరీలు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.దీంతో భారత్‌ 601 పరుగుల వద్ద తన తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది.