ప్రయాణికుల సౌకర్యార్థం విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు

0
263

మనఛానల్‌ న్యూస్‌ – అమరావతి
వరుస పండుగల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడుపు తున్నట్లు విజయవాడ రైల్వే డివిజన్‌ పీఆర్వో నుశ్రత్‌.ఎం.మండ్రూప్‌కర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. రైలు నెంబరు (07053) సికింద్రాబాద్‌ – కాకినాడటౌన్‌ ప్రత్యేకరైలు అక్టోబర్‌ 11వ తేదీ రాత్రి 9.40కు సికింద్రాబాద్‌లో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 7.40కు కాకినాడటౌన్‌ చేరుతుంది.

రైలునెంబరు (07054) కాకినాడటౌన్‌ – సికింద్రాబాద్‌ ప్రత్యేకరైలు అక్టోబర్‌ 13వ తేదీ రాత్రి 8 గంటలకు కాకినాడటౌన్‌లో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 7.40కు సికింద్రాబాద్‌ చేరు తుంది.రైలునెంబరు (07255) నరసాపూర్‌– సికింద్రాబాద్‌ ప్రత్యేకరైలు అక్టోబర్‌ 10,12వ తేదీలలో రాత్రి 6 గంటలకు నరసాపూర్‌లో బయలుదేరి మరుసటిరోజు తెల్లవారుజామున 4 గంటలకు సికింద్రాబాద్‌ చేరుతుంది.

రైలునెంబరు (07256) సికింద్రాబాద్‌–నరసాపూర్‌ ప్రత్యేకరైలు అక్టోబర్‌ 11వ తేదీ రాత్రి 8 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 6.05కు నరసాపూర్‌ చేరుతుంది. రైలు నెంబరు(07255) నరసాపూర్‌ – సికింద్రాబాద్‌ ప్రత్యేకరైలు అక్టోబర్‌ 13వ తేదీ రాత్రి 8.50కు నరసాపూర్‌లో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 5.50కు సికింద్రాబాద్‌ చేరుతుంది.ఈ ప్రత్యేకరైళ్లు విజయవాడ మీదుగా రాక,పోకలు సాగిస్తాయని ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పీఆర్వో తెలిపారు.