కెప్టెన్‌గా 50వ‌ టెస్ట్‌ మ్యాచ్‌ ఆడుతున్న విరాట్‌ కోహ్లీ

0
189

మనఛానల్‌ న్యూస్‌ – స్పోర్ట్స్‌ డెస్క్‌
పుణె టెస్టుతో కెప్టెన్ విరాట్ కోహ్లీ మ‌రో రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నాడు. భార‌త జ‌ట్టు త‌ర‌పున టెస్టుల్లో 50 మ్యాచ్‌ల‌కు కెప్టెన్సీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన ప్లేయ‌ర్‌గా ఘ‌న‌త సాధించాడు. ద‌క్షిణాఫ్రికాతో పుణెలో జ‌రుగుతున్న రెండ‌వ టెస్టుతో కోహ్లీ ఈ రికార్డును అందుకున్నాడు.మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోనీ గ‌తంలో ఈ మైలురాయిని దాటాడు.

ధోనీ మొత్తం 60 టెస్టుల‌కు సార‌థ్య బాధ్య‌త‌లు వ‌హించాడు. 2008 నుంచి 2014 మ‌ధ్య ధోనీ టెస్టు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించాడు.49 మ్యాచ్‌లతో మూడ‌వ స్థానంలో సౌర‌వ్ గంగూలీ ఉన్నాడు.భార‌త్ త‌ర‌పున ప్రాతినిధ్యం వ‌హించ‌డం అదృష్టంగా భావిస్తున్న‌ట్లు కెప్టెన్ కోహ్లీ తెలిపాడు.ఇదో చిన్న మైలురాయి,కానీ త‌న ఫోక‌స్ మొత్తం మ్యాచ్ గెలుపుమీదే ఉంద‌ని విరాట్ చెప్పాడు.త‌న క్రికెట్ కెరీర్‌లో జ‌రిగిన ప్ర‌తి అంశానికి కృత‌జ్ఞ‌త‌ను తెలియ‌జేస్తున్న‌ట్లు కోహ్లీ చెప్పాడు.

టీమిండియా స‌క్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా కోహ్లీకి గుర్తింపు ఉన్న‌ది.అత‌ని సార‌థ్యంలో ఇండియా ఇప్ప‌టి వ‌ర‌కు 29 టెస్టుల్లో నెగ్గింది.మ‌రో ప‌ది మ్యాచ్‌లు డ్రా కాగా, ఇంకా ప‌ది మ్యాచ్‌ల్లో ఓడిపోయారు.కోహ్లీ సార‌థ్యంలోనే టీమిండియా ఆస్ట్రేలియా గ‌డ్డ‌పై టెస్టు సిరీస్ విక్ట‌రీని న‌మోదు చేయడం విశేషం. కెప్టెన్‌గా కోహ్లీ గెలుపు-ఓట‌మి శాతం 2.9గా ఉన్న‌ది.ఆస్ట్రేలియా కెప్టెన్లు స్టీవ్ వా,రికీ పాంటింగ్ త‌ర్వాత కోహ్లీనే ఉన్నాడు.