స్పెషల్‌ నేషనల్‌ ఇంటిగ్రేషన్‌ క్యాంప్‌కు ఎంపికైన మదనపల్లె మిట్స్ విద్యార్థులు

0
106

మనఛానల్‌ న్యూస్‌ – మదనపల్లె
చిత్తూరుజిల్లా కురబలకోట మండలం అంగళ్లు వద్ద గల మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్,మదనపల్లె (మిట్స్ ఇంజనీరింగ్) కళాశాలలో యెన్.సి.సి లో గల ఇద్దరు క్యాడెట్స్ లకు స్పెషల్ నేషనల్ ఇంటెగ్రేషన్ క్యాంప్ నందు పాల్గొనే అవకాశం లభిందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి.యువరాజ్ గారు తెలిపారు.

బి.టెక్ తృతీయ సంవత్సరం చదువుతున్న బి.ప్రతిభ మరియు ద్వితీయ సంవత్సరం చదువుతున్న కే.రమ్య లకు ఈ నెల 12 వ తేదీ నుండి 23వ తేదీ వరకు జె.యెన్.వి పెద్దాపురం నందు జరగబోయో స్పెషల్ నేషనల్ ఇంటెగ్రేషన్ క్యాంపు నందు పాల్గొనే అవకాశాన్ని అందుకున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ సి.యువరాజ్ గారు తెలిపారు.ఈ ఎంపికలకు చిత్తూర్ 35 ఆంధ్ర బెటాలియన్లో గల రెండు అవకాశాలను మిట్స్ కళాశాల యెన్.సి.సి క్యాడెట్స్ అందిపుచ్చుకొవడం అభినందనీయం అని,ఇటువంటి స్పెషల్ నేషనల్ ఇంటెగ్రేషన్ క్యాంపు నందు పాల్గొని దేశ సమక్యతను కావలసిన శిక్షణతోపాటు వివిధ సంస్కృతీ,సంప్రదాయాలను తెలుసుకొని సమాజ శ్రేయస్సుకు పాటుపడాలన్నారు.

ఈ క్యాంపు నందు సాంస్కృతిక పోటీ,డ్రాయింగ్ పోటీ, చర్చ, కాల్పుల పోటీ మరియు ఇతర సహ పాఠ్య కార్యకలాపాలు వంటి వివిధ కార్యక్రమాలు జరుగుతాయి అని,ఇటువంటి క్యాంపులకు మహిళా యెన్.సి.సి క్యాడెట్స్ పాల్గొనడం అభినందనీయం అని కొనియాడారు. వీరిని ఆదర్శంగా తీసుకోని తదితర యెన్.సి.సి క్యాడెట్స్ కూడా నేషనల్ ఇంటెగ్రేషన్ క్యాంప్ ల నందు పాల్గొనాలని పిలుపు నిచ్చారు.ఎంపికయిన క్యాడెట్లను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి.యువరాజ్,మిట్స్ యెన్.సి.సి లెఫ్ట్ నెంట్ డాక్టర్ నవీన్ కుమార్ మరియు తదితర విద్యార్థులు అభినందనలు తెలియజేశారు.