రసాయనశాస్త్రంలో నోబెల్‌ బహుమతి -2019కి ఎంపికైన ముగ్గురు శాస్త్రవేత్తలు

0
30
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – ఇంటర్నేషనల్‌ డెస్క్‌
గత రెండురోజుల్లో 2019 ఏడాదికిగాను వైద్య,భౌతికశాస్త్రాల్లో నోబెల్‌ విజేతలను ప్రకించిన రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ బుధవారం రసాయన శాస్త్రంలో పురస్కార గ్రహీతల పేర్లను వెల్లడించింది. రసాయన శాస్త్రంలో విశేష సేవలందించిన జాన్‌.బి.గుడెనఫ్‌,ఎం.స్టాన్లీ విట్టి౦గమ్,అకిరా యోషినోలకు సంయుక్తంగా ఈ పురస్కారాన్ని అందజేయనున్నట్లు రాయల్‌ స్వీడీష్‌ అకాడమీ సెక్రటరీ జనరల్‌ గోరన్‌ కె.హాన్స్‌న్‌ ప్రకించారు.లిథియం ఆయాన్‌ బ్యాటరీ అభివృద్ధికి చేసిన విశేష పరిశోధనలకుగాను వీరికి ఈ పురస్కారం లభించింది.పురస్కారం పొందిన జాన్‌ గుడెనఫ్‌ 97 ఏళ్ల వయస్సులో ఈ గౌరవాన్ని అందుకోవడం విశేషం.