పట్టువదలని ఆర్టీసీ కార్మికులు – మెట్టుదిగని తెలంగాణ ప్రభుత్వం

0
48
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – హైదరాబాద్‌
తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె రోజురోజుకూ ఉధృతమవుతోంది.ఒకవైపు తాము సమ్మె విరమించేది లేదంటూ కార్మికులు పట్టువదలకపోవడం,మరోవైపు తక్షణం విధులకు హాజరు కాకపోతే చర్యలు తప్పవంటూ ప్రభుత్వం మెట్టుదిగడం లేదు.సమ్మె మొదలయి ఐదు రోజులు గడిచినా ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కడం లేదు.ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను నెరవేర్చేందుకు ప్రభుత్వం నో చెబుతోంది.దీంతో తమ డిమాండ్లు నెరవేర్చేవరకు సమ్మె ఆపేది లేదని జేఏసీ పెద్దలు పట్టుబట్టి కూర్చుకున్నారు.

ఇప్పటికే సమ్మె చేపట్టిన వారిలొ సుమారు 48వేల మందికి పైగా కార్మికులను ఉద్యోగం నుంచి ప్రభు త్వం తొలగించింది.వారి ఖాళీలను భర్తీ చేసేందుకు కొత్త రిక్రూట్ మెంట్లు చేస్తున్నామని అంటోంది. ఉద్యోగాలు పోయినా సరే తాడో పేడో తేల్చుకుంటామని కార్మికులు చెబుతున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.అయితే ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది.ఇక దీనిపై ఈరోజు మరోసారి ప్రభుత్వ పెద్దలతో ఆర్టీసీ ఉన్నతాధికారులు భేటీ కానున్నారు.

భేటీ అనంతరం ఏం చేయాలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.అయితే తెలంగాణ ఉద్యమం చేపట్టిన సమయంలో సమ్మె చేపట్టిన ఏ ఉద్యోగిని తొలగించనప్పుడు సొంత రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలగించ డమేంటని జేఏసీ మండిపడుతోంది.ఇదిలా ఉంటే ఇప్పటివరకు ఆర్టీసీకి, ప్రభుత్వానికి మధ్య జరుగు తున్న ఈ వివాదంలో ప్రతిపక్షాలు జోక్యం చేసుకున్నాయి. ఆర్టీసీ ఉద్యోగులను తొలగించడంపై కాంగ్రెస్ భగ్గుమంది.ఇవాళ అఖిలపక్ష నేతలు కూడా సమావేశమై ప్రభుత్వ నిర్ణయాలపై చర్చించనున్నారు. మరోవైపు దసరా పండక్కు ఊర్లకు వెళ్లిన ప్రజలు పట్నానికి తిరుగుపయనం అయ్యారు.

వారికి ఆర్టీసీ సదుపాయం లేకపోతే ఇప్పుడు కూడా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది.దసరా వచ్చినప్పుడే సమ్మె జరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.సొంతూళ్లకు వెళ్లేందుకు డబుల్, ట్రిపుల్ ఛార్జీలు చెల్లించాల్సి వచ్చింది.ఇక హైదరాబాద్ లాంటి సిటీల్లో కూడా ప్రస్తుతం నడుస్తున్న బస్సుల్లో అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు.బస్ పాస్‌లు ఉన్నప్పటికీ అవి కూడా చెల్లవని చెబుతుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.