చిత్తూరుజిల్లా పాకాలలో విషాదం – యూపీఎస్‌ బ్యాటరీ పేలి ఇరువురు మృతి

0
26
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – పాకాల
యూపీఎస్‌ బ్యాటరీ పేలి తల్లి,కుమారుడు మృతి చెందిన విషాదకర సంఘటన చిత్తూరుజిల్లాలో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే జిల్లాలోని పాకాల మండలం గానుగపెంట గ్రామం పూనేపల్లిలో శంకరమ్మ (80),ఆమె కుమారుడు శేఖర్‌ (60) నివాసముంటున్నారు.తాము ఉంటున్న ఇంటిలో యూపీఎస్‌ బ్యాటరీ అమర్చుకున్నారు.అయితే బుధవారం ఉదయం అకస్మాత్తుగా యూపీఎస్‌ బ్యాటరీ పేలిపోవడంతో అ౦దులో ఉన్న శంకరమ్మ,శేఖర్‌లకు తీవ్రగాయాలయ్యాయి.గాయపడిన వీరిరువురూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు.ప్రమాదానికి గల కారణాలను స్థానిక పోలీసులు ఆరా తీస్తున్నారు.