ఏపీలో రేపటి నుంచి వైఎస్సార్‌ కంటి వెలుగు – శ్రీకారం చుట్టనున్న సీఎం వై.ఎస్‌.జగన్‌

0
27
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – అమరావతి
ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి పలు వినూత్న పథకాలకు శ్రీకారం చుడుతున్నారు.ప్రభుత్వం చేపట్టిన అన్ని పథకాలు ప్రజలకు చేరువ అయ్యేలా సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ఈనెల 10న సీఎం జగన్ ప్రారంభించనున్నారు.వరల్డ్ సైట్ డే సందర్భంగా అనంతపురంలోని ఓ జూనియర్ కాలేజీలో ఈ కార్యమానికి శ్రీకారం చుట్టనున్నారు.

ప్రజలందరికీ వైఎస్సార్ కంటి వెలుగు కింద ఉచితంగా కంటి పరీక్షలు,శస్త్రచికిత్సలు చేయనున్నారు. మొత్తం 5 దశల్లో మూడేళ్లపాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది.తొలి రెండు దశల్లో విద్యార్థులకు కంటి వెలుగు పథకాన్ని అమలు చేస్తారు.మిగిలిన మూడు దశల్లో కమ్యూనిటీ బేస్ ఆధారంగా కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. పర్యవేక్షణ కోసం జిల్లాల ఆధారంగా కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు.ఇక కంటి వెలుగు సంబంధించిన పరికరాలు,సామాగ్రి,మందుల్ని సిద్ధం చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

FacebookTwitterWhatsAppPinterestLinkedIn