ఏపీలోని మూడుజిల్లాల్లో పిడుగులు పడే అవకాశం – ఆర్టీజీఎస్‌ హెచ్చరిక

0
34
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – విశాఖపట్నం
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం,విశాఖపట్నం,తూర్పు గోదావరి జిల్లాల్లో బుధవారం పిడుగులు పడే అవ కాశం ఉందని ఆర్టీజీఎస్‌ హెచ్చరికలు జారీ చేసింది.తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే పిడుగుపాటుకు గురై కొంతమంది రైతులు,గొర్రెలు,ఆవులు మృత్యువాత పడ్డాయి.ఒక్క ఖమ్మం జిల్లాలోనే ఒకేరోజు ఏడుగురు రైతులు మృతిచెందడం గమనార్హం.కావున ఉరుములు,మెరుపులతో కూడిన వర్షం పడే వేళల్లో ప్రజలు చెట్ల కింద ఉండకుండా సురక్షిత ప్రదేశాల్లో ఉండాలన్నారు.అదేవిధంగా ఆవులు,ఎద్దులు,గేదెలను షెల్టర్‌ కిందకు తరలించాలన్నారు.బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం తెలియజేసింది.