తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె – సమీక్షించిన సీఎం కేసీఆర్‌

0
33
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – హైదరాబాద్‌
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు వెనక్కి తగ్గడం లేదు.సీఎం కేసీఆర్‌ హెచ్చరిస్తున్నా యధావిధిగా సమ్మెలో పాల్గొంటున్నారు.దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు.అయితే ఆర్టీసీ సమ్మె, ప్రస్తుత పరిస్థితిపై ఇవాళ మరోసారి సీఎం కేసీఆర్‌ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లను సీఎం మరోమారు సమీక్షించనున్నారు.

నిన్నటి సమావేశ నిర్ణయాలకు కొనసాగింపుగా ఇవాళ మధ్యాహ్నం తర్వాత మంత్రులు,అధికారులతో కేసీఆర్‌ సమావేశం కానున్నారు.ప్రత్యామ్నాయ ఏర్పాట్లు,అద్దె బస్సులు వంటి అంశాలపై సమీక్షించ నున్నారు.ప్రైవేటు బస్సులకు రూట్‌ పర్మిట్లు, కొత్త సిబ్బంది నియామకం వంటి అంశాలపై,ఆర్టీసీపై అధ్యయన వివరాలను సునీల్‌శర్మ కమిటీ సీఎంకు వివరించనుంది.సునీల్ శర్మ కమిటీ నివేదికపై సీఎం సమీక్షించనున్నారు.