పార్లమెంటరీ స్థాయి సంఘాలను ప్రకటించిన స్పీకర్‌ ఓం బిర్లా

0
70

మనఛానల్‌ న్యూస్‌ – నేషనల్‌ డెస్క్‌
లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా పార్లమెంటరీ స్థాయి సంఘాలను ప్రకటించారు.వివిధ శాఖలకు ఛైర్మన్లతోపాటు సభ్యులను నియమించినట్లు లోక్‌సభ సచివాలయం వెల్లడించింది.ఇందులో తెలుగురాష్ట్రాలకు చెందిన కొందరు ఎంపీలకు ఛైర్మన్‌ పదవులు దక్కాయి.పరిశ్రమలో స్థాయి సంఘం ఛైర్మన్‌గా తెరాస నేత కె. కేశవరావు,వాణిజ్య వ్యవహారాల పార్లమెంటరీ స్థాయి సంఘం ఛైర్మన్‌గా వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి,రవాణా,పర్యాటక,సాంస్కృతిక శాఖ స్థాయి సంఘం ఛైర్మన్‌గా టి.జి.వెంకటేష్‌లు నియమితులయ్యారు.

అదేవిధంగా పెట్రోలియం స్థాయి సంఘం ఛైర్మన్‌గా భాజపా ఎంపీ రమేశ్‌ బిధురి,ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ స్థాయి సంఘానికి ఛైర్మన్‌గా కాంగ్రెస్‌ నేత శశి థరూర్‌ను నియమించారు.ఇక హోం వ్యవహారాల స్థాయి సంఘం ఛైర్మన్‌గా మరో కాంగ్రెస్‌ నేత ఆనంద్‌ శర్మ,రక్షణ వ్యవహారాల స్థాయి సంఘం ఛైర్మన్‌గా భాజపా సీనియర్‌ నేత పి.పి.చౌదరి,అందులో సభ్యుడిగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరం నియమితులయ్యా రు.

గతంలో చిదంబరం హోంశాఖ వ్యవహారాల స్థాయి సంఘం ఛైర్మన్‌గా వ్యవహరించారు.రైల్వే వ్యవహారాల స్థాయి సంఘానికి రాధామోహన్‌ సింగ్‌ ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు.ఎరువులు,రసాయనాల స్థాయి సంఘం ఛైర్మన్‌ బాధ్యతలు డీఎంకే ఎంపీ కనిమొళికి దక్కాయి.స్థాయి సంఘంలో కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌ గాంధీ, అభిషేక్‌ సింఫ్వీులు సభ్యులుగా ఉన్నారు.