ఏపిలో ఎ.బి.ఎన్ ,టి.వి.-5 ఛానళ్లపై అపక్రటిత నిషేధం

0
117

మనఛానల్ న్యూస్ – అమరావతి
ఏపిలో తెలుగుదేశం పార్టీ అనుకూల టివి చానళ్లుగా ముద్రపడిన ఎ.బి.ఎన్. మరియు టి.వి-5 చానళ్లను శుక్రవారం నుంచి నిషేదించినట్లు తెలుస్తోంది. దీనిపై ఎ.బి.ఎన్ చానల్ యజమాన్యం తమ స్వంత పత్రిక యైన ఆంధ్రజ్యోతిలో శనివారం అనధికారికంగా నిషేధించిన సమాచారాన్ని ప్రముఖంగా ప్రచురించింది. అప్రకటిత నిషేధంపై తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పందనలను ప్రముఖంగా ప్రచురించింది. అలాగే పలువురు టి.డి.పి నేతలు సైతం అప్రకటిత నిషేధంపై తీవ్రంగా ఖండించారు. టివి-5,ఎబిఎన్ ఛానళ్లు ఎన్నికల అనంతరం కూడ జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో వార్తలు ప్రసారం చేస్తుండడంతో అధికార పార్టీ నేరుగా ఆ ఛానళ్లపై చర్యలు తీసుకోకుండ, వేరే మార్గంలో ఎం.ఎస్.ఓల ద్వారా టి.వి-5,ఎబిఎన్ ప్రసారాలను వ్యూహాత్మకంగా నిషేదం విధించినట్లు తెలుస్తోంది. గతంలో తెలంగాణలో కె.సి.ఆర్.ప్రభుత్వం ఇదే మాదరిగా ఎబిఎన్, టివి-9 ఛానళ్లను నిషేధం విధించగా, టి.వి-9 పాత యాజమాన్యం ప్రభుత్వ పెద్దలతో చర్చించుకొని అప్రకటిత నిషేధం నుంచి భయటపడగా. ఎబిఎన్ ఛానల్ కు ఈ నిషేధం నుంచి భయటపడడానికి సుమారు 6 నెలల సమయం పట్టింది. తెలుగుదేశం పార్టీకి అనుకూల ఛానళ్లుగా ముద్రపడిన ఈ రెండు ఛానళ్లు ఈ అప్రకటిత నిషేధం నుంచి ఏ విధంగా భయటపడుతాయోనని అందరూ ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.